హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “నారప్ప” ఓటిటి లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. కానీ అది ఓటిటి రిలీజ్ అవ్వడం పట్ల అభిమానులు సహా జెనరల్ ఆడియెన్స్ లో కూడా కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనితో తన మరో మోస్ట్ అవైటెడ్ సినిమా “దృశ్యం 2” మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే ఓకే చెప్పనున్నారని బజ్ ఆ మధ్య వచ్చింది. అలాగే మరి దీనితో పాటుగా మేకర్స్ ఈరోజు సెప్టెంబర్ 20న ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపైనే వారు ఓ బ్యాడ్ న్యూస్ ని వెల్లడించారు. “కొన్ని అనుకోని ఊహించని పరిణామాల రీత్యా ఈరోజు రిలీజ్ చేస్తామన్న దృశ్యం 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని వాయిదా వేస్తున్నామని, ఈ అసౌకర్యానికి చింతున్నామని” అభిమానులకు సారీ చెప్పారు. మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అన్నది చూడాలి. ఇక ఈ చిత్రంలో మీనా, ఎస్తర్ అనీల్ తదితరులు నటించగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆశీర్వాద్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Due to unforeseen circumstances, the release of the first look of Drushyam 2 has been delayed. Sorry for the inconvenience.
— Suresh Productions (@SureshProdns) September 20, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa