ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు చిన్న కూతురికి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 02:15 PM

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కల్యాణ్ దేవ్‌తో మార్చి 28, 2016న బెంగళూర్‌లోని చిరు ఫాం హౌస్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే . ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు, కుటంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఆ త‌ర్వాత పార్క్ హయత్ హయత్ హోటల్ లో శ్రీజ, కళ్యాణ్ ల రిసెప్షన్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. శ్రీజ, కళ్యాణ్ ల వివాహం జ‌రిగి నేటితో రెండేళ్ళు పూర్తి కావ‌డంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు శ్రీజ దంప‌తుల‌కి విషెస్ తెలియ‌జేస్తున్నారు. క‌ళ్యాణ్ దేవ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ‌తో పాటు నివృత్తి( శ్రీజ మొద‌టి భ‌ర్త కూతురు ) తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నువ్వే నా బ‌లం.. పెళ్ళి రోజు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశాడు. దీనికి నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పెళ్ళి రోజు శుభాకాంక్ష‌లు బావ అని కామెంట్ పెట్టారు. 


చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లో వెండితెర‌పై మెర‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు . ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్‌కు జోడీగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తుంది. "బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండ‌గా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో నటిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa