ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 29న ఉదయం 9.42కి లాంచ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 03:04 PM

ఎన్టీఆర్ బయోపిక్ ను లాంచ్ చేసే సమయం కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు హాజరు కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.


ఈ నెల 29వ తేదీన ఉదయం 9.42 నిమిషాలకి ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ - నాచారం .. రామకృష్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం జరగనుంది. బాలకృష్ణ తన తండ్రి సొంత ఊరు 'నిమ్మకూరు' నుంచి .. తల్లి సొంత ఊరు 'కొమరవోలు' నుంచి అభిమానులను ఆహ్వానించినట్టు సమాచారం. 29వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి .. ద్వితీయ విఘ్నం లేకుండగా ఆ మరునాడు షూటింగ్ చేస్తారట. ఆ తరువాత కొన్ని రోజులకు రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa