శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "లవ్ స్టోరీ". మరి ఎట్టకేలకు కొన్ని ఒడిదుడుకులు దాటుకొని ఈ చిత్రం నిన్న రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ దగ్గర కూడా ఈ ఏడాది రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది. తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమా 5 రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. ఈ సినిమా ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ ల వద్ద ఇప్పటి వరకూ రూ. 21.18 కోట్ల షేర్లను సాధించినట్టు తెలుస్తుంది.
5 డేస్ కలెక్షన్ రిపోర్ట్:
నిజాం – రూ.10.08 కోట్లు
సీడెడ్ – రూ.3.32 కోట్లు
ఈస్ట్ – రూ.1.29 కోట్లు
వెస్ట్ – రూ.1.09 కోట్లు
గుంటూరు – రూ.1.29 కోట్లు
కృష్ణా – రూ.1.08 కోట్లు
నెల్లూరు – రూ 0.68 లక్షలు
యూఎస్ – రూ.2.35 కోట్లు
లవ్ స్టోరీ 5 రోజుల కలెక్షన్లు ఏపీ, తెలంగాణ కలిపి రూ. 21.18 కోట్ల షేర్లు (రూ.34.38 కోట్లు) రాగా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.26.66 కోట్ల షేర్లు, రూ. 46.80 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa