హాట్ కేక్స్ తో పోల్చాలా.. అంతకన్నా క్రేజీ థింగ్స్ అని చెప్పాలా.. ‘రంగస్థలం’ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని చెప్పడానికి మరే పోలికలూ సరిపోయేలా లేవు. ఓవర్సీస్ మొదలుకుని, ఓ మోస్తరు టౌన్లలోని థియేటర్ల వరకూ.. ఒకే స్థాయి క్రేజ్ కనిపిస్తోంది ఈ సినిమా మీద. ఈ సీజన్లో విడుదల అవుతున్న తొలి భారీ సినిమాగా రామ్ చరణ్ సినిమాకు బ్రహ్మాండమైన క్రేజ్ అగుపిస్తోంది. ప్రీ రిలీజ్ బజ్ నేపథ్యంలో ఈ సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయమనే చెప్పాలి.
మామూలుగా రామ్ చరణ్ సినిమా వేరు.. రంగస్థలం వేరు.. అని చెప్పాలి. సినిమా నేపథ్యం, 80ల నాటి కథాంశం అదనపు ఆకర్షణ అవుతోంది. ఎలాగూ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు సుకుమార్ సుపరిచితుడు. సుక్కూ క్రితం సినిమాలు ఓవర్సీస్ లో, మల్టీప్లెక్సుల్లో భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో కేవలం రామ్ చరణ్ ఫ్యాన్ బలగంలోనే కాకుండా.. సినీ ప్రేక్షకులందరిలో కూడా ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తుతోంది.
దీంతో బంపర్ ఓపెనింగ్స్ ఖాయం. ఇక ఎలాగూ మెగా ఫ్యాన్ బలగం ఉండనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో పవన్ కల్యాణ్ సినిమా ఒకింత నిరాశపరిచినా.. ఆ లోటును కూడా పూడ్చేలా రంగస్థలం సంచలనం ఖాయమనే అంచనాలతో ఉంది అభిమానగణం. చరణ్ సినిమాపై వస్తున్న పాజిటివ్ బజ్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరి కొన్ని గంటల్లో రంగస్థలం పై తమ అభిమాన హీర విన్యాసాలను చూస్తామనే ఎగ్జయిట్ మెంట్ తో ఉంది మొత్తం అభిమానగణం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa