ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నపిల్లలకు సాయం చేయడం కోసం యంగ్ యాక్టర్లంతా

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 30, 2018, 12:30 PM

టాలీవుడ్ లో ఇప్పుడు యంగర్ జనరేషన్ హీరోలు చాలామందే ఉన్నారు. వీళ్లలో చాలామంది ఇప్పుడు ఒకచోటకు వచ్చి సందడి చేశారు. ఇదంతా సినిమా షూటింగ్  కాసం కాకుండా ఓ మంచి పనికోసం చేశారు. సరైన సదుపాయాలు లేక చదువుకు దూరమైపోతున్న చిన్నపిల్లలకు సాయం చేయడం కోసం యంగ్ యాక్టర్లంతా ఓ ఈవెంట్ చేశారు. 


పిల్లలకు మంచి విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థకు ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు నటి మంచు లక్ష్మి ముందుకొచ్చింది. ఆమె చొరవతో యంగ్ హీరో.. హీరోయిన్ల్లంతా ఓ ఈవెంట్ లో ర్యాంప్ పై మెరుపులు మెరిపించారు. నిఖిల్ - అల్లు శిరీష్ - నవదీప్ - సుశాంత్ - అడవి శేష్ - ఆదర్శ్ - రకుల్ ప్రీత్ సింగ్ - ఈషా రెబ్బా - తేజస్వి మాదివాడ - సీరత్ కపూర్ తో పాటు మరికొందరు ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. 


ఈ ఈవెంట్ కు హీరోలంతా వీలైనంత వరకు బ్లాక్ డ్రస్ లో స్టయిలిష్ లుక్స్ తో వస్తే హీరోయిన్లంతా సంప్రదాయ దుస్తుల్లో అచ్చ తెలుగు ఆడపిల్లల్లా కనిపించడం హైలైట్. ఏదేమైనా ఓ మంచి పనికోసం ఇంతమంది ఒకేసారి కలిసిరావడం అభినందించాల్సిన విషమయే. కీపిటప్ ఆల్ ఆఫ్ యూ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa