పాకిస్థాన్ నటి, రయీస్ ఫేం మహీరాఖాన్ తొలి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే . రయీస్ చిత్రంలో ఈ అమ్మడి నటనకి అందరు ఫిదా అయ్యారు. అయితే పలు వివాదాలతో ఈ అమ్మడు మరింత పాపులర్ అయింది. గత ఏడాది రణ్‌బీర్‌తో కలిసి న్యూయార్క్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాలకి చిక్కింది. దీనిపై కొందరు మహీరాని టార్గెట్ చేసి దూషణకి దిగారు. నువ్వు ముస్లిం అయి ఉండి సిగరెట్ ఎలా తాగుతావు, ఓపెన్ డ్రెస్ ఎలా ధరిస్తావు అంటూ ఆమెపై విమర్శలు కురిపించారు. దీనిపై ఇది నా పర్సనల్ మేటర్. ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఈ సంఘటన ద్వారా చాలా మంచి గుణపాఠం నేర్చుకున్నాను అని అప్పట్లో తెలిపింది మహీరా. తాజాగా ఓ పార్టీలో సిగరెట్ తాగుతూ మరోసారి కెమెరా కంట పడింది. దీంతో నెటిజన్స్ కొందరు మహీరాపై విమర్శల వర్షం కురిపిస్తుంటే మరి కొందరు ఆమెకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు సిగరెట్ తాగడం కామన్ అయిపోయింది. మగవారు తాగితే తప్పులేదుగాని, ఆడవాళ్ళు తాగితే తప్పొచ్చిందా అని కొందరు మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఇష్యూపై మహీరా ఏమైన స్పందిస్తుందేమో చూడాలి. 33 ఏళ్ళ మహీరాకి ఓ కుమారుడు ఉన్న విషయం విదితమే.
She will be doing sehar & aftaar programs in ramdan and teaching Pakistanis about islam.
Warning - Smoking kills#MahiraKhan pic.twitter.com/pgY7YxWES4
— Zeeshan Haider (@iZeeshan_Haider) March 27, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa