ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వర్యారాయ్ కు లేఖ రాసిన రేఖ

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 04:19 PM

బాలీవుడ్ లో ప్రవేశించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ కి ఎవర్‌ గ్రీన్‌ రేఖ లేఖ రాశారు. ఆ లేఖ వివరాల్లోకి వెళ్తే... "ప్రియమైన ఐష్... అప్పుడే 20 ఏళ్లు పూర్తైపోయాయా? వావ్... నువ్వు ప్రవహించే నదిలాంటి దానివి, నదిలాగే నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలవు. నువ్వేం చెప్పావన్నది, చేశావన్నది జనం మర్చిపోవచ్చు, అయితే వారికి నువ్వెలాంటి ఫీలింగ్ కల్గించావన్నది మాత్రం ఎన్నటికీ మర్చిపోరు. ఏదైనా సాధించాలంటే ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ధైర్యం. ధైర్యం లేకపోతే ఎందులోనూ నైపుణ్యం సాధించలేము. నువ్వు ధైర్యానికి సరైన ఉదాహరణ.


నువ్వు నోరు తెరిచి మాట్లాడేలోపే నీ నమ్మకం, నీ శక్తి మాతో మాట్లాడేస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ సాధించావు. అది కూడా మా అందరి కళ్లూ నీ నుంచి మరల్చుకోలేనంత అందంగా సాధించావు. ఎన్నో కష్టాలు అనుభవించావు. ఫీనిక్స్ పక్షిలా వాటన్నింటినీ దాటి పైకి ఎదిగావు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నానన్నది మాటల్లో వర్ణించలేకపోతున్నాను. నువ్వు వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించావు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించావు. అయితే నువ్వు చేసిన అన్ని పాత్రల్లో నాకు ఇష్టమైనది, ప్రస్తుతం నువ్వు పోషిస్తున్న ఆరాధ్యకు తల్లి పాత్ర. ఆరాధ్యని ప్రేమిస్తూనే ఉండు, నీ మ్యాజిక్‌ ని పంచుతూనే ఉండు. నీ హృదయం మోయలేనన్ని, పట్టలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. లవ్ యూ జీతే రహో" అంటూ రేఖ లేఖను ముగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa