రాంచరణ్ రంగస్థలం సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని తిరగరాస్తుంది . మార్చి 30న విడుదలైన రంగస్థలం భారీ వసూళ్ల ని సాధిస్తోంది . మొత్తంగా మూడు రోజుల్లో 88 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది రంగస్థలం చిత్రం . ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్ల ని సాధిస్తోంది ఈ చిత్రం . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ అన్ని కలుపుకొని మూడు రోజుల్లో 88 కోట్లు వసూల్ కాగా 50 కోట్ల కు పైగా షేర్ వచ్చింది దాంతో బయ్యర్లు కూడా సంతోషంగా ఉన్నారు .
రంగస్థలం చిత్రాన్నీ 75 కోట్ల బడ్జెట్ తీయగా ఈ సినిమా కి విడుదలకి ముందు మంచి క్రేజ్ రావడంతో మంచి బిజినెస్ జరిగింది . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో రంగస్థలం చిత్రాన్ని నిర్మించగా చరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించాడు . చరణ్ తో పాటుగా సమంత కు అనసూయ కు మంచి పేరు వస్తోంది పెర్ఫార్మెన్స్ పరంగా .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa