ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆచారీ గారు ఎన్ని సార్లు సినిమాని వాయిదా వేస్తారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 07:01 PM

మంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర సినిమా ఇప్పట్లో విడుదల అయ్యేలా లేదు. ఈ సినిమా  ఈనెల 6న విడుదల కావాల్సి ఉండే కానీ అర్దాంతరంగా వాయిదా వేశారు.  దాంతో ఈనెల 6న విడుదల కావడం లేదు ఇక కొత్త డేట్ ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ ఏప్రిల్ 27 న ఉండొచ్చట . అసలు ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ పలురకాల  కారణాలతో మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది.  కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ  వాయిదాపడింది .


అయితే ఈసారి వాయిదా పడటానికి కారణం రంగస్థలం చిత్రంతో పాటు నితిన్ చల్ మోహన్ రంగ చిత్రాలు కారణం . మార్చి 30న విడుదలైన రంగస్థలం చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తోంది దాంతో ఎక్కువ థియేటర్ లలో ఆ సినిమానే ఆడుతోంది ఇక మిగిలిన థియేటర్ లలో నితిన్ చల్ మోహన్ రంగ వస్తోంది ఈ సమయంలో పోటీకి పోయి దెబ్బ తినేకంటే కొంత గ్యాప్ తీసుకొని వస్తే హిట్ కొట్టొచ్చు అని భావిస్తున్నారట ఆ చిత్ర బృందం అందుకే విడుదల వాయిదా వేశారు .







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa