తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ అందాల హీరోయిన్ జయప్రద. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో శ్రీదేవి, జయప్రద అంటే గ్లామర్ తో పాటు అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. క్లాసికల్ డ్యాన్స్ లో ఆమెకు ఆమే సాటి. దక్షిణాది చిత్రరంగాన సత్తాచాటి, ఉత్తరాదిన ప్రతిభతో ప్రకాశించిన అందాల నటి జయప్రద పుట్టినరోజు నేడు.ఏపీలోని రాజమండ్రిలో 1962, ఏప్రిల్ 3న జన్మించిన జయప్రద అసలు పేరు లలితా రాణి. బాల్యంలో నృత్యం నేర్చుకున్నజయప్రద... తన 14 ఏళ్ల వయసులో పాఠశాలలో జరిగిన ఒక నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి మరియు బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ జయప్రదకు మాత్ర సినిమా చాన్సులు లభించలేదట. సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను కనుగొన్నాడు.ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.ఒక దర్శకుడు ‘భూమి కోసం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో మూడు నిమిషాలపాటు ఉండే నృత్యం చేశారు. ఇందుకు ప్రతిఫలంగా జయప్రద 10 రూపాయలు తీసుకున్నారు. 1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో ఆమెకు స్టార్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘సిరిసిరిమువ్వ’, ‘సీతాకల్యాణం’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అమితంగా అలరించారు. 1979లో జయప్రద బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa