ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆందాలు ఆర‌బోస్తేనే అవ‌కాశాలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 02:46 PM

అందం, అభిన‌యం, వాచ‌కం ఉంటే సినీ రంగంలో అవ‌కాశాలు రావ‌ని, వాటితో పాటే అందాలు ఆర‌బోస్తేనే అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా.. . హీరోయిన్లను కేవలం అందాల బొమ్మలుగానే చూపిస్తున్నారని, వారి నటనను చూపించడం లేదని వాపోయింది. దీంతో చాలా మంది రాజీ పడిపోతున్నారని చెప్పింది. అందుకే చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలే తప్ప స్టార్ హీరోయిన్ లు ఉండడం లేదని పేర్కొంది. ప్రస్తుతం గ్లామర్‌ కి అర్థం మారిపోయింద‌ని, , అవసరం ఉన్నా లేకపోయినా బికినీలు వేయడం, సీన్‌ డిమాండ్‌ చేస్తోందనీ, అరకొరా దుస్తులు వేసుకోవడం, లిప్‌ లాక్‌ సీన్స్ పెట్టడమే గ్లామర్ గా చూపుతున్నార‌ని అంది. కోలీవుడ్ లో నయనతార ఒక్కరే స్టార్ హీరోయిన్ అని , ఆమెలా తనకు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు ఇస్తే నిరూపించుకోగలనని పేర్కొంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa