దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 1971లో జరిగిన ఇండో – పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఓ ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఆకాశ్ జోడీగా నేహా శెట్టి నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటన్నది.. ఈ సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..ఇండో- పాక్ సరిహద్దులో జరిగే ప్రేమ కథ అని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.. దేశాన్ని ప్రేమించే శక్తి ఒక్క సైనికుడికే ఉంటుంది.. అటువంటి సైనికుడి ప్రేమ పొందడం ఎంతో అదృష్టం అన్న డైలాగ్ తో పాటు ప్రేమికులను చంపేస్తే మళ్లీ పుడతారనే అర్ధంతో మరో డైలాగ్ హైలెట్ గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa