ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిర్మాత కుమారుడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 10, 2018, 12:46 PM

కాస్టింగ్ కౌచ్ పై ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ లు ఈ విషయమై స్పందించినప్పటికీ హీరోయిన్ శ్రీ రెడ్డి మాత్రం తనకు పూర్తి న్యాయం జరిగేవరకు, అలానే తెలుగు అమ్మాయిలకు సినిమా అవకాశాలు కల్పించే వరకు ఈ వివాదానికి ముగింపు పలకనని అంటున్నారు. అంతటితో ఆగకుండా శేఖర్ కమ్ముల, అలానే ఒక నాచురల్ స్టార్, వైవా హర్ష, సింగర్ శ్రీరామచంద్ర లాంటి ప్రముఖుల పేర్లు బయటపెట్టి సంచలనానికి తెరలేపారు ఆమె. కాగా ఈ విషయమై ఆమె మొన్న ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. అయితే ఆతరువాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించి ఆమెకు సభ్యత్వం ఇచ్చెది లేదని, ఇటువంటి చర్యలు సరైనవి కావని తేల్చి చెప్పింది.


దానిపై శ్రీరెడ్డి నేడు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో స్పందిస్తూ, ఒక స్త్రీ అలా అర్ధనగ్నంగా ఫిలిం ఛాంబర్ ముందు నిలబడితే కనీసం ఏమిజరింగిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సంబందించిన ఒక్కరు అడగలేదు. ఇలాంటివాళ్లా నాకు సభ్యత్వం ఇవ్వను అనేది అని, ఆమె మా సంఘం పై ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా ఆమె నేడు ఒక ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ షోలో ఆమె ఒక సంచలన ప్రకటన చేశారు. కాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని చెప్పిన ఆమె, ప్రముఖ నిర్మాత  తనయుడు తనను శారీరకంగా వాడుకున్నాడని, తనకి అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి తరువాత మోసం చేసాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె చేస్తున్న ఈ నిందారోపణలు ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది, కాగా కొందరు నెటిజన్లు ఆమె చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి ఆ జాతీయ ఛానల్ తో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa