ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ మూవీలో ముఖ్యమైన పాత్రలో షాలినీ పాండే

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 10, 2018, 01:15 PM

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ బేబీ‌గా మారిన షాలిని పాండేకి ప్రిన్స్ మహేష్ బాబుతో నటించే బంపర్ ఆఫర్ తగిలినట్లు ఫిలిం సర్కిల్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో షాలినీ పాండేకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో మెచ్యూరిటీ ఉన్న నటిగా మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుని బబ్లీ బబ్లీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా అర్జున్‌ రెడ్డితో బేబీ అని ముద్దుగా పిలిపించుకోవడంతో.. ఈ పేరును చాలా మంది ప్రేమికులు రియల్ లైఫ్‌ ప్రేమకథలకు వాడేస్తున్నారంటే బేబీకి ఎంత క్రేజ్ ఉందో అర్థమౌతోంది. ఇక ఈ మూవీతో బాగా పాపులర్ అయిన షాలినీ తమిళ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. ఇక తెలుగులో కీర్తి సురేష్, సమంతలు నటిస్తున్న ‘మహానటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది షాలినీ. 


 


తాజాగా ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత మహేష్ కెరియర్‌లో 25 మూవీగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ మూవీకి సైన్ చేశారు. దిల్ రాజు - అశ్వినీదత్ నిర్మించనున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా డీజే భామ పూజా హెగ్డే ఫైనల్ కాగా.. ఒక ముఖ్యమైన పాత్రను షాలినీ పాండేతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్టుగా సమాచారం. మొత్తానికి ఓ బిగ్ ప్రాజెక్ట్ మూవీలో సూపర్ స్టార్ ‌సరసన సూపర్ ఛాన్స్ కొట్టిసింది టాలీవుడ్ బేబీ. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa