ఏ మాయ చేసావె సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి సమంత చాలా రోల్స్ చేసింది. వాటన్నింటిలో చాలాచాలా స్పెషల్ రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర. ఈ మూవీలో సమంత కెరీర్ లో తొలిసారి విలేజ్ గర్ల్ పాత్ర చేసింది. ఈ రోల్ కోసం సమంత ఎంత కష్టపడాలో అంతగానూ కష్టపడింది. అసలు గ్లామర్ కంటెంట్ లేని రోల్ లోనూ శామ్ చాలా బాగా మెప్పించింది. రంగస్థలం మూవీ శామ్ నటనతో పాటు అభిమానులు ఎక్కువగా మాట్లాడుతున్న టాపిక్ మరోటుంది. అది ఇంటర్వెల్ ముందు హీరో రామ్ చరణ్ కు ఇచ్చిన లిప్ కిస్. సినిమాలో ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. కథాపరంగా అక్కడ హీరోయిన్ ముద్దివ్వడం కరెక్టే అని అంటూనే ఇప్పుడు సమంతకు పెళ్లయిందనే విషయం ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయం సమంత వద్ద ప్రస్తావిస్తే దీనిపై చాలా క్లారిటీగా సమాధానిమిచ్చింది. ‘‘పెళ్లయిన హీరోలు చాలా మంది లిప్ లాక్ సీన్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సీన్ ఎందుకు చేశావని వాళ్లను ఎందుకు అడగరు? సుకుమార్ ఈ సీన్ నెరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ సీన్ లో హీరోకు ముద్దు ఇవ్వడం కరెక్టని అనుకున్నాకే దర్శకుడికి ఓకే చెప్పాను. కానీ అందరూ అనుకుంటున్నట్లు చరణ్ పెదవులపై ముద్దు పెట్టలేదు. నేను ముద్దు పెట్టింది బుగ్గలపై మాత్రమే. అది లిప్ లాక్ అనిపించడం కేవలం కెమెరా ట్రిక్’’ అంటూ శామ్ క్లారిటీ ఇచ్చింది.
సమంత మొదటి సినిమా ఏ మాయ చేసావెలో చేసిన జెస్సీ రోల్ ఆమెకు విపరీతమైన పేరు తెచ్చింది. ఈ సినిమా తమిళం.. హిందీలోనూ వచ్చింది. కానీ సమంతకు వచ్చినంత పేరు ఆ రెండు భాషల్లో చేసిన హీరోయిన్లు త్రిష - అమీ జాక్సన్ లకు రాలేదు. ఆ తరవాత మళ్లీ ఆ రేంజిలో రంగస్థలంలో రామలక్ష్మి పాత్రకు గుర్తింపు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa