“గౌతమీపుత్ర శాతకర్ణి”తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ “ఫిదా, తొలిప్రేమ” చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనుంది. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి “ఘాజీ” చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతోపాటు తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికలుగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ఆల్రెడీ స్పెషల్ ట్రయినింగ్ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa