నటీమణి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ సినిమాలో సమంత, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) సమంత, విజయ్ దేవరకొండ పోషిస్తున్న జర్నలిస్ట్ మధురవాణి, ఫొటో జర్నలిస్ట్ విజయ్ ఆంటోని పాత్రలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా, టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ మే 9న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa