శ్రీ రెడ్డి.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిలను లొంగదీసుకుని అన్యాయం చేస్తున్నారంటూ గత కొంతకాలంగా ఈమె జరుపుతున్న పోరాటాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకుంటున్నారు. మహిళల పట్ల సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ప్రవర్తించే తీరు అసహనానికి గురి చేస్తోందని, ఎంతో మంది మహిళల జీవితాలు ఇండస్ట్రీ పెద్దల చేతిలో నలిగిపోతున్నాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మీడియా ముందుకొచ్చిన శ్రీ రెడ్డి మెల్లగా తన పోరాటాన్ని విస్తృతం చేసింది.
చివరకు ఫిలించాంబర్ ఎదుట అర్థ నగ్న ప్రదర్శన కూడా చేసి తన నిరసన తెలిపింది. అయితే అప్పటివరకూ స్పందించని ‘మా’ సభ్యులు ఈ నిరసన పట్ల మాత్రం స్పందించి.. శ్రీరెడ్డిపై నిషేధం విధిస్తూ.. ఆమెతో టాలీవుడ్‌లోని నటులెవ్వరూ నటించడానికి వీల్లేదని, కాదని నటిస్తే చర్యలు తప్పవని చెప్పారు. అయినా కూడా ఈ మాత్రం వెనుకడుగేయకుండా మరింత ముందుకెళ్తూ మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాల మద్దతు కూడగట్టింది శ్రీ రెడ్డి. దీంతో వారం తిరగకముందే శ్రీరెడ్డి విషయంలో యూటర్న్ తీసుకుని ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ‘మా’ ప్రకటించింది.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా రోజుకొకరి పేరు చొప్పున పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెడుతూ.. సినీ ఇండస్ట్రీ లోని కీచకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న శ్రీ రెడ్డిని తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసించాడు. ‘‘ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న శ్రీ రెడ్డిని గౌరవిస్తున్నాను. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసి విక్టరీ సాధించిన నీకు వందనాలు’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa