నాని తాజా చిత్రంగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ దగ్గర సందడి ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ .. "వేసవి సెలవుల్లో అందరినీ అలరించే సినిమా ఇది .. ఈ వీకెండ్ లో తప్పకుండా చూడవలసిన సినిమా" అన్నాడు."థియేటర్స్ లో అంతా నవ్వుతూ .. కేరింతలు కొడుతూ ఈ సినిమా చూస్తుంటే నాకు కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది. పైరసీని ఎంకరేజ్ చేయకుండా అంతా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి" అని అన్నాడు. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ .. " 'కృష్ణార్జున యుద్ధం' చూసిన తరువాత అంతా ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అన్ని ఏరియాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కృష్ణ పాత్రకి దక్కుతోన్న ఆదరణ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa