ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 27న అఖండ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 23, 2021, 08:55 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన  యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ  డిసెంబర్ 2న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.నవంబర్ 27న అఖండ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రముఖ శిల్పకళా వేదికగా నిర్వహించనున్నారు. మొత్తం టీమ్‌తో పాటు, ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి పలువురు ప్రముఖ సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు.బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి అఖండ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.ఎస్ తమన్ సంగీతం అందించగా మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa