సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. పుష్ప ది రైజ్ పేరుతో తొలి భాగం డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐటమ్ సాంగ్ కోసం సమంత ఎంపికైనట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ కి సంబంధించి కొన్ని రోజులు నుంచి ఓ టాక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పెషల్ గెస్ట్ గా పలువురు బిగ్ స్టార్స్ పేర్లే వినిపించాయి కానీ లేటెస్ట్ గా ఇంకో టాక్ ఏమిటంటే పుష్ప వేడుకకి ఏ గెస్ట్ ని పిలవబోవడం లేదట. అయితే ఇది తెలుగు వెర్షన్ వరకూ మాత్రం అని తెలుస్తుంది. లాస్ట్ టైం లానే ఈసారి కూడా సోలో ప్రీ రిలీజ్ నే ఉంటుందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa