ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:07 PM

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమాలోని మూడో పాటను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3న 'సాన కష్టం' పాటను విడుదల చేశారు. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని హింట్ ఇస్తూ చిరంజీవి స్టెప్పులేస్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాజల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa