నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 107 చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఇదిగోండి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య అభిమానులకు సర్ ప్రైజ్ అప్ డేట్ ఇచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు 'దునియా' విజయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. టీమ్‌లో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa