ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి బరిలో 'బంగార్రాజు' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 04, 2022, 08:49 PM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమాలో హీరోయినిగా కృతి శెట్టి నటించింది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాని మొదట జనవరి 15న విడుదల చేయాలనుకున్నారు.కానీ ఇప్పుడు 13వ తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ కావడంతో సంక్రాంతికి ఈసారి వసూళ్లంతా 'బంగార్రాజు' ఖాతాలోకి చేరుతుందని అంటున్నారు.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa