'ఒరు ఆడార్ లవ్' సినిమాలోని కన్ను కొట్టే సీన్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియా వారియర్ పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియా వారియర్ కు ఓ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పుకొచ్చింది.
ఫెర్న్ గొరెగావ్ హోటల్‌లో తాను బస చేశానని చెప్పింది. ఆ హోటల్ లో బయట ఫుడ్‌ను లోనికి అస్సలు అనుమతించరట. అతిథులు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయని అలా చేస్తారట. అయితే తనకు ఆ విషయం తెలియదని, షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోటల్ కు వచ్చానని ప్రియా తెలిపింది. తాను ఎంతో మర్యాదగా వారిని వేడుకున్నా, ఈ ఒక్కసారికి వదిలేయండని కోరినా వారు వినిపించుకోలేదట. డబ్బులు పెట్టి కొన్న ఫుడ్ ను పారేయడం ఇష్టం లేక బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చిందని ప్రియా వారియర్ చెప్పుకొచ్చింది. ఆ ఫుడ్‌ను బయటే వదిలేయాలంటూ పెద్ద సీన్ చేశారని, చాలా అమర్యాదగా ప్రవర్తించారని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa