ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ తో పెళ్లి వార్తలపై స్పందించిన రష్మిక

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 05:44 PM

వరుస సినిమాలతో రష్మిక మందన్నా దూసుకుపోతోంది. తాజాగా పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా పాన్ ఇండియా సినిమా లైగర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్-రష్మిక జంటగా నటించారు. గీతా గోవిందం సినిమాకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను రష్మిక రద్దు చేసుకుంది. దీంతో ట్రోలర్లు విజయ్ కోసమే ఆమె ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకుందనే పుకార్లు పుట్టించారు. వీటిని వారిద్దరూ కొట్టి పడేస్తూ వచ్చారు. అయినా వదంతులు ఆగడం లేదు. 2022 న్యూ ఇయర్ వేడుకలను వీరిద్దరూ గోవాలో జరుపుకోవడం, ఇటీవల ముంబైలో కలిసి విహరించడంతో సోషల్ మీడియా వీరి వివాహంపై కోడై కూసింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను విజయ్ దేవరకొండ ఇటీవల ఖండించాడు. దానిపై తాజాగా రష్మిక కూడా స్పందించింది. వాటిని పనిలేని వారు పుట్టిస్తారని, అలాంటివి విన్నప్పుడు నవ్వుకుని వదిలేస్తానని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa