రాధేశ్యామ్ సినిమా కోసం ప్రభాస్, పూజా హెగ్డే ఎంతో కష్టపడ్డారని డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ చెప్పాడు. 'ప్రభాస్, పూజ రాధేశ్యామ్ కోసం ప్రాణం పెట్టారు. మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాంగ్ షూట్ చేశాం. టెంట్ లోపల ఉన్నా గడ్డకట్టుకుపోయే చలి ఉండేది. కానీ ఈ ఇద్దరు కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని పాటలో నటించారు' అని చెప్పాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa