ఆర్ఆర్ఆర్ సినిమా ఎపుడెపుడా అని అందరూ ఎదురుచూస్తుంటే ఆ సినిమా కోసం అమెరికాలో భారీ ఎత్తున్న బుకింగ్స్ జరుగుతున్నాయటా. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడింది. చివరకు కరోనా తగ్గడంతో ఈ నెల 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని ఒకరు ప్రీమియర్ షో కోసం ఏకంగా 75 టికెట్లు కొనడం విశేషం. ఆ టికెట్లకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa