అత్యాచార ఆరోపణలతో మలయాళ దర్శకుడు లీజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కొచ్చిలోని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కొచ్చిలోని కక్కనాడ్కు చెందిన ఓ మహిళపై.. లీజు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు.. ప్రేమమ్ ఫేం నవీన్ పౌలి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పడవెట్టు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతకుముందు 'ఐమా' అనే మూవీని డైరెక్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa