ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమయంలో హీరోయిన్‌లాగా కనిపించడం లేదంటూ విమర్శలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 02:53 PM

బాలీవుడ్‌లో అలనాటి హీరోయిన్ మాధురి దీక్షిత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ నటి అందంతో పాటు అభినయంతో 1980 నుంచి 2000 మధ్య ఉన్న యువత మనసులను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ సినీయర్ నటికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అయితే ఈ తార నటిగా కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో అసలు హీరోయిన్ మెటీరియలే కాదంటూ కొందరు విమర్శలు చేశారంట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధురి స్వయంగా తెలిపింది.‘అబోధ్’ అనే మూవీతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మాధురి 1988లో వచ్చిన ‘తేజాబ్’తో తొలి సక్సెస్ అందుకుంది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. తన నటనతో జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. ఈ సీనియర్ నటి నటించిన తాజా కిడ్నాప్ డ్రామా ‘ఫేమ్ గేమ్’. ఈ వెబ్‌సిరీస్ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్‌‌ని సొంతం చేసుకుంది. ఈ షో ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఈ తార కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న విమర్శల గురించి పంచుకుంది.

మాధురి మాట్లాడుతూ.. ‘సినీ నటిగా నా ప్రస్థానం మొదలైనప్పుడు నేను చాలా యంగ్. చాలా చిన్నదానిలా కనిపించేదాన్ని. దీంతో నేను హీరోయిన్ మెటీరియల్‌ను కాదంటూ, హీరోయిన్‌లాగా కనిపించడం లేదంటూ విమర్శలు చేశారు. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అలాంటి పరిస్థితులను నేను కూడా ఎదుర్కొన్నాను. వాటి వల్ల నాకు నిరుత్సాహంగా అనిపించేది. కానీ మా అమ్మ చాలా స్ట్రాంగ్ లేడి. నాతో నీ పనిని నువ్వు సక్రమంగా చేయి, గుర్తింపు దానంతట అదే వస్తుందని చెప్పేది. అలాగే విజయాన్ని రుచి చూపిస్తే జనాలు అన్నీ మర్చిపోతారని నన్ను ప్రోత్సహించేది. అందుకే ఎప్పుడూ ఆమె సలహాలు తీసుకుంటుంటా’ అని చెప్పుకొచ్చింది.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa