ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బాలీవుడ్ బ్యూటీ బయోపిక్ లో నటించాలని ఉంది: మాళవిక మోహనన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 05:02 PM

రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది మాళవిక మోహనన్. అయితే ఈ సినిమా ఆశించినంత హిట్ కాలేదు కానీ మాళవికా మాత్రం ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో మాళవికా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తమిళ్, మాలయాళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ జోష్‏లో ఉంది ఈ ముద్దుగుమ్మ.


ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన మారన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మాళవికా తాజాగా సోషల్ మీడియాలో తనపై వచ్చే రూమర్స్ పై స్పందించింది. మాళివికా మాట్లాడుతూ ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో.. పూర్తి నిడివి గల పాత్రను మారన్ సినిమాలో చేసినట్టుగా తెలిపింది. అలాగే ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నా అలాంటివి జరగడం వల్ల వాటి నుంచి మంచి అనుభవం కూడా వస్తుందని మాళవికా తెలిపింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బయోపిక్ తీస్తే అందులో తను ఆమె పాత్రలో నటించాలని ఉందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa