ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తల్లో నిజం లేదు: పూజా హెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 05:52 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు తనకు మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ వస్తున్న వార్తలపై పూజా హెగ్డే స్పందించింది. 'ప్రభాస్‌తో మనస్పర్థలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదు. షూటింగ్‌లో మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్లం. నా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు. ఆయన చాలా మంచి వ్యక్తి' అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది.


అసలు మొదట్లో ఈ విషయమై చిత్ర యూనిట్ సైలెంట్‌గా ఉండటంతో అది నిజమే అని అంతా భావించారు. పూజా వల్ల షూటింగ్ విషయంలో యువి క్రియేషన్స్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు టాక్ వినిపించింది. ఆ విషయంలో ప్రభాస్ కలుగజేసుకుని ఆమెను మందలించారని చెప్పుకున్నారు. అయితే అది నిజం కాదని చివరకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు అదే విషయమై నోరువిప్పింది పూజా హెగ్డే. ప్రభాస్‌తో మనస్పర్ధలు వచ్చాయని షికారు చేసిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది పూజా హెగ్డే. దీంతో టోటల్‌గా ఈ ఇష్యూకి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa