అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' సినిమాతో వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు.ఈ సినిమా బాక్స్ఆఫీస్ ధగరా బ్లాక్ బస్టర్ గా నిలిచి,కాసుల వర్షం కురిపించింది.ఇప్పుడు నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ఘోస్ట్' సినిమాలో కనిపించనున్నాడు.ప్రస్తుతం దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం.ఈ షెడ్యూల్‌లో నాగార్జున,సోనాలి చౌహాన్ మధ్య మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తున్నారు.నారాయణ్ దాస్ నారంగ్,పుస్కుర్ రామ్మోహన్ రావు మరియు శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు.గుల్ పనాగ్,అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ షెడ్యూల్ తర్వాత 'ఘోస్ట్' సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారు అని వెళ్ళడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa