'బాహుబలి 2' తరువాత అనుష్క నటించిన 'భాగమతి' లో ఆమె నటనకు మంచిపేరు వచ్చినా ఆమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఎక్కడా అవకాశాలు రాలేదు. ఆతరువాత అనేక ఆలోచనలు చేసి ఆమె నటించిన 'నిశ్శబ్దం' మూవీని ఓటీటీ లో విడుదల అయినా సగటు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.వాస్తవానికి అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఒక సినిమాను అంగీకరించింది. తనకన్నా వయసులో చిన్నవాడైన నవీన్ పోలిశెట్టి తో ఆమె ఈసినిమాలో నటించడానికి అంగీకరించినా ఎందుకో ఈసినిమా ఇంకా ప్రారంభం కాలేదు. దీనితో అనుష్క ఏమి చేస్తోంది అంటూ ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె ఒప్పుకున్న ఒక సినిమాకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలోఅనుష్క ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అన్ అంటున్నారు. సక్సెస్ రేట్ పక్కన పెడితే విజయ్ తీసిన సినిమాలు చాల పేరు తెచ్చుకున్నాయి. బలమైన కథలను ఒక డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌తో స్క్రీన్ ప్లే వ్రాసుకుని సినిమాలు తీయడం విజయ్ అలవాటు. రీసెంట్ గా జయలలిత బయోపిక్ 'తలైవి' తీసి విజయ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు.ఇది ఇలా ఉండగా అనుష్క తన అజ్ఞాతాన్ని వీడి ఇక వరసపెట్టి సినిమాలు చేయాలి అన్న సంకేతాలు తనను కలుస్తున్న దర్శకులకు ఇస్తున్నట్లు టాక్. ముఖ్యంగా తనకోసం హీరోయిన్ ఓరియంటెడ్ కథలను తయారుచేయమని ఆమె యంగ్ డైరెక్టర్స్ కు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లేడీ సూపర్ స్టార్ నయనతార లా దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా మారాలని అనుష్క చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయితే మళ్ళీ దక్షిణాది సినిమా రంగంలో అనుష్క హవా మొదలయ్యే అవకాశం ఉంది అన్న సంకేతాలు ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతున్నాయి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa