రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజాహెడ్గే నటించిన 'రాధేశ్యామ్' ఈరోజు రిలీజ్ అయ్యిన విషయం అందరికి తెలిసందే.గత కొన్ని రోజులుగా ఈ సినిమా భారీగా ప్రమోషన్స్ చేసారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా కోసం ప్రభాస్‌ని ఇంటర్వ్యూ చేశాడు.ఇంటర్వ్యూలో రాజమౌళి చాలా సిగ్గుపడే వ్యక్తి ఎలా బయటకు వెళ్లి సినిమా ప్రమోషన్స్‌లో ఎలా పాల్గొంటున్నాడు అని ప్రభాస్‌ని అడిగాడు.అయితే ఈ ప్రశ్నకు రెబెల్ స్టార్ ప్రభాస్ ఇలా సమాధానం ఇచ్చాడు.రాజమౌళి దగ్గరే ఓపెన్ అవ్వడం నేర్చుకున్నానని,బాహుబలి కోసం ఒక రోజులో దాదాపు నలభై ఇంటర్వ్యూలు,అది కూడా ముంబై మీడియాతో ఆ రోజును మర్చిపోలేనని ప్రభాస్ చెప్పాడు.ఆ ఎక్స్‌పోజర్ ఇప్పుడు 'రాధేశ్యామ్'ని కూడా ప్రమోట్ చేసే అవకాశాన్ని ఇచ్చిందని ప్రభాస్ అన్నారు.
ప్రస్తుతం రాజమౌళి 'RRR' సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa