ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇందులో రామకృష్ణ పరమ హంస పాత్రను తెలుగులో ప్రభాస్ అన్నయ్య కృష్ణంరాజు పోషించారు. సత్యరాజ్ (కట్టప్ప) హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆ పాత్రను పోషించారు. అయితే యూఎస్ లో తెలుగు వెర్షన్ చూసిన ప్రేక్షకులు కృష్ణంరాజు కాకుండా సత్యరాజ్ ను చూసి కన్ఫ్యూజ్ అయినట్లు తెలుస్తోంది. ఒకే భాష కోసం రెండు వేర్వేరు వెర్షన్లను రూపొందించాలా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా 10 రోజుల పాటు టిక్కెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ వైపు ఉత్కంఠ.. మరోవైపు బెనిఫిట్ షోకు అనుమతి రాకపోవడంతో ఏపీలోని అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa