పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్టుతో పీరియాడికల్,రొమాంటిక్ ఎంటెర్టైనర్గా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మార్చి 11న విడుదలవనున్న నేపథ్యంలో పూజ చేసిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
"రాధేశ్యామ్ ఫలితం ఎలా ఉన్నాకానీ, ప్రేరణగా ఈ సినిమాలో నన్ను ఎంతో అందంగా చూపించేందుకు కృషి చేసిన నా ప్రియమైన టీం సభ్యులందరికీ ధన్యవాదాలు, మీరు నాపట్ల తీసుకున్న జాగ్రత్తలకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేసింది.
రాధేశ్యామ్ విజువల్ వండర్ గా థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయనుందో మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa