ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ ను హెచ్చరిస్తున్న ప్రభాస్ ఫాన్స్ ....

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 03:41 PM

థియేటర్లలో రాధేశ్యామ్ సందడి మొదలైంది. ఎక్కడ చూసిన ప్రభాస్ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలే కనబడుతున్నాయి. ప్రభాస్ అభిమానుల హంగామా ఒక రేంజులో ఉంది. 


కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం రాధే శ్యామ్ సినిమాకు టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వం నుండి అనుమతి లభించలేదు. దీంతో ఎలాంటి బెనిఫిట్ షోలు లేకుండానే “రాధేశ్యామ్” ఆంధ్రాలో విడుదలైంది. 


ఇప్పటికే తెలంగాణాలో రాధేశ్యామ్ బెనిఫిట్ షోలు వేసేసారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో “రాధేశ్యామ్” బెనిఫిట్ షోను వేయడానికి ప్రయత్నించిన అప్సర థియేటర్ ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు థియేటర్ కు తాళాలు వేయడంతో ఈరోజు సినిమాను ప్రదర్శించడం లేదని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ కొనసాగుతూనే ఉంటుందంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొంతమంది వైఎస్ జగన్ ను  బాగా గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa