ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధేశ్యామ్ కు శుభాకాంక్షల వెల్లువ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 03:47 PM

దర్శకుడు రాధాకృష్ణకుమార్ రూపొందించిన అందమైన,ఖరీదైన ప్రేమ కావ్యం రాధేశ్యామ్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలవనున్న నేపథ్యంలో పలు సినీ ప్రముఖులు రాధేశ్యామ్ చిత్రబృందానికి సోషల్ మీడియా వేదికగా  శుభకాంక్షలు తెలియజేసారు. 


ఈ చిత్రం విజయం సాధించాలని,ఎప్పటిలాగే చరిత్ర సృష్టించాలని ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ హీరో దగ్గుబాటి రానా ట్వీట్ చేసాడు. ఈ విజువల్ వండర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసాడు హీరో శ్రీవిష్ణు. మా డార్లింగ్ సినిమా అంటే మళ్ళీ మళ్ళీ చూస్తామని డైరెక్టర్ మారుతి ట్వీట్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంచు విష్ణు,సుశాంత్,అడవి శేష్, కోన వెంకట్ గోపీచంద్ మలినేని,హను రాఘవపూడి,డైరెక్టర్ బాబీ తదితరులు ఉన్నారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa