వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా, శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా మెర్రి క్రిస్మస్. రమేష్ తురాని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని గతేడాది డిసెంబర్లోనే ప్రకటించగా, కత్రినా కైఫ్ పెళ్లి, ఇంకా పలు కారణాల వల్ల షూటింగ్ ప్రారంభమవలేదు.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగు మొదలయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కత్రినా కైఫ్ తెలపటం విశేషం. అంధాదున్, ఏక్ హసీనా థి వంటి చిత్రాలతో బాలీవుడ్లో రచయితగా, దర్శకుడిగా సత్తా చాటిన శ్రీరామ్ కు విలక్షణ నటుడు సేతుపతి దొరకడంతో ఈ మూవీ పై అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సేతుపతి-కత్రినా జోడి తొలిసారి నటిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దక్షిణాదిలో వరస సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న సేతుపతి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు పొందాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa