ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఖిలాడి స్ట్రీమింగ్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 11:59 AM

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా రూపొందింది. పోస్టర్, టీజ‌ర్, ట్రైల‌ర్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ స్వరాలను అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ సందడి చేయడం ఖాయమనే టాక్ వచ్చింది.అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను వదిలారు. మరి ఓటీటీ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa