ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ “విక్రమ్” నుంచి అప్డేట్...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 12:26 PM

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రమ్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ని కొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మార్చి 14న సాయంత్రం 7 గంటలకు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ తాజా ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa