ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్సింగ్ రింగులో సూర్య హీరోయిన్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 12:30 PM

స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాతో  తెలుగు ప్రేక్షకులను పలకరించిన నటి అపర్ణ బాలమురళి. అపర్ణ మలయాళ, తమిళ భాషలలో నటిగానే కాక సింగర్ గా కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం బాక్సింగ్ ప్రాక్టీసు చేస్తుంది అపర్ణ. శిక్షకుడి సమక్షంలో బాక్సింగ్ మెళకువలు నేర్చుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోని అపర్ణ ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు సినీ నటులు అపర్ణకు శుభాకాంక్షలను కామెంట్ల రూపంలో  తెలియజేస్తున్నారు.   


ఆమె ప్రస్తుతం నిధం ఒరు వానమ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో రీతూవర్మ, శివాత్మిక రాజశేఖర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుందరి గార్డెన్ అనే మళయాళ చిత్రానికి కూడా అపర్ణ పచ్చజెండా ఊపింది . నీరజ్ మాధవ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర షూటింగు  త్వరలోనే మొదలుకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa