స్టార్ హీరో చియాన్ విక్రమ్ అండ్ దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో రానున్న 'ధృవ నచ్చతిరమ్' ప్రాజెక్ట్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ఇది ఒకటి.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,విక్రమ్ ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభించాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.'ధృవ నచ్చతిరమ్' సినిమాని మేకర్స్ 2022 జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని మేకర్స్ వెల్లడించారు.స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు.రాధిక శరత్‌కుమార్,సిమ్రాన్, ఆర్ పార్థిబన్,దివ్యదర్శిని,మున్నా,వంశీకృష్ణ తదితరులుకీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa