ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకప్పటి స్టార్ రైటర్... ఇలా అయిపోయాడేంటి?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 03:59 PM

టాలీవుడ్లో పరుచూరి బ్రదర్స్ అంటే ఒకప్పుడు పెద్ద పేరు. పరుచూరి బ్రదర్స్ పేరుతో వెంకటేశ్వర రావు, గోపాల కృష్ణ ల ద్వయం మూడు వందలకు పైగా చిత్రాలకు రచన చేసి చాలా సంవత్సరాలపాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడమే కాక కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు ఈ అన్నదమ్ములు. మరో విశేషం ఏమంటే… ఈ అన్నదమ్ములు వెండితెరపై పలు చిత్రాలలో నటించి, అలరించారు కూడా. 


పరుచూరి బ్రదర్స్లో పెద్దవారైన వెంకటేశ్వరరావుకు ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు జయంత్ సి. పరాంజీ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని కలిసి పరామర్శించి,  ఆయనతో ఒక ఫోటో దిగారు. తాజాగా ఈ ఫోటోను ఇంస్టాలో షేర్ చేసి  ‘గురువు గారిని చూసి బాధపడ్డాను కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి చురుకుగానే  ఉంది’ అని పేర్కొన్నారు. కానీ ఈ ఫోటో చూసిన  చాలామంది వెంకటేశ్వర రావు గారు ఇలా అయిపోయారేమిటీ?’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa