బాలీవుడ్ యాక్షన్ కింగ్ అజయ్ దేవగణ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రన్ వే 34'. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ పైలట్ గా కనిపించబోతున్నారు. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసారు అజయ్ దేవగణ్. వీటిని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి 'బ్రేస్ ఫర్ ఇంపాక్ట్' అని ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్ గంభీర స్వరంతో సాగే ఈ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 21 న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో ముంబైలో జరిగే ఒక ఈవెంటులో రన్ వే 34 ట్రైలెర్ను రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa