కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్‌కి గతేడాది బాగా కలిసొచ్చింది. ఆయన తీసిన 'డాక్టర్' చిత్రం భారీ విజయం సాధించి శివ కార్తికేయన్ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత.. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ మంచి సక్సెస్ ఫుల్ దర్శకులే కావడం గమనార్హం. తాజాగా టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నటి మరియా కీలక పాత్ర పోషిస్తోంది. అందులో హీరోకి ఇంగ్లీషు నేర్పే టీచర్, హీరోపై మోజు పెంచుకుంది. ఈ ప్రేమకథను పూర్తిగా సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ శైలిలో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఇందులో ఉక్రేనియన్ బ్యూటీ మరియా రైబోషాప్కా టీచర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa