సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. ఆయనకు 49 సంవత్సరాలు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆయన పాటలు రాశారు. ఉస్మానియా యూనివర్సిటి నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. పలు హిల్ చిత్రాలకు కూడా పాటలను అందించారు. గలగల పారుతున్న గోదారిలా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మళ్లీ కూయవే గువ్వా, చిన్నీ మా బతుకమ్మా చిన్నారక్క బతుకమ్మ పాటలను ఆయన రాశారు. ఆయన మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పూరీ జగన్నాథ్ కందికొండకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. చక్రి ఆయనను పరిశ్రమకు పరిచయం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa