ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రచయిత.. ఫోటోలు వైరల్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 04:11 PM

పరచూరి బ్రదర్స్ గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులెవరూ ఉండరు. టాలీవుడ్ లో 350కి పైగా సినిమాలకు వారు కథలు, మాటలు అందించారు. పరచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం 'పరుచూరి పలుకులు' పేరుతో యూట్యూబ్‌ ఛానల్ ద్వారా తన అనుభవాలు పంచుకుంటున్నారు. ఇక మరో సోదరుడు పరుచూరి వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా, నటుడిగా అందరికీ సుపరిచితమే. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అది చూసిన నెటిజెన్లు షాక్ అవుతున్నారు. దర్శకుడు జయంత్​ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి దిగిన ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. ఆ ఫొటోలలో పరుచూరి వెంకటేశ్వరరావు ఎవరు గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు. ఆయన వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa